MLC Kavitha: సంపద సృష్టించడం.. పంచడం కేసీఆర్‌కే సాధ్యం
MLC Kavitha: పదేళ్ళలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3.17 లక్షలు
MLC Kavitha: సంపద సృష్టించడం.. సంపదను పేదలకు పంచడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని మోడల్‌గా నిలిపారన్నారు ఎమ్మెల్సీ కవిత. పదేళ్లలో రాష్ట్ర తలసరి ఆదాయం 3 లక్షల రూపాయలు దాటడం తెలంగాణ అభివృద్ధికి నిదర్శనమన్నారు. భూమిలేని పేదలు, రైతులను సమానంగా చూడటమే సీఎం లక్ష్యమన్నారు. బీఆర్‌ఎస్ మేనిఫెస్టో చూసి కాంగ్రెస్, బీజేపీ నేతలు ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నారన్నారు.
మేనిఫెస్టోను చిత్తుకాగితమన్న వారికి ఎన్నికల తర్వాత తెలుస్తుందన్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడటం రేవంత్‌రెడ్డి స్థాయికి తగదన్న కవిత బీజేపీ, కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపించారు. దమ్ముంటే రాహుల్ గాంధీ అమరజ్యోతి దగ్గర నివాళులర్పించాలని కవిత సవాల్ విసిరారు.