MLC Kavitha: కోర్టులోకి వెళ్లేముందు కవిత కీలక వ్యాఖ్యలు

MLC Kavitha: లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కోర్టుకు వెళ్లే ముందు కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-03-16 06:24 GMT

MLC Kavitha: కోర్టులోకి వెళ్లేముందు కవిత కీలక వ్యాఖ్యలు

MLC Kavitha: లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కోర్టుకు వెళ్లే ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. నన్ను కావాలనే ఇరికించారని కవిత ఆరోపించారు. నాది అక్రమ అరెస్ట్.. నా అరెస్ట్ పై న్యాయ పోరాటం చేస్తామని కవిత చెప్పారు. ఆమె తరఫున సీనియర్‌ లాయర్‌ విక్రమ్‌ చౌదరి వాదనలు వినిపించనున్నారు.

శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు.. రాత్రి దిల్లీలోని కేంద్ర కార్యాలయానికి తరలించారు. ఇక్కడి ప్రత్యేక సెల్‌లో ఆమెను ఉంచారు. శనివారం ఉదయం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

Tags:    

Similar News