MLC Elections in Telangana 2021: ఆ రెండు రోజులు మూతపడనున్న వైన్ షాపులు
MLC Elections in Telangana 2021: తెలంగాణలో గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆరు జిల్లాల్లోని వైన్ షాపులు మూసివేత.
MLC Elections in Telangana 2021: తెలంగాణలో గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ ఎన్నికల 14వ తేదీన జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆరు జిల్లాల్లోని వైన్ షాపులు 12 నుండి 14వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహాబుబ్‌నగర్, నల్గొండ మరియు పూర్వ ఖమ్మం జిల్లాలోని అన్ని వైన్ షాపులు, బార్లు రెండు రోజుల పాటు అంటే మార్చి 12 సాయంత్రం 4 నుండి 14 వ తేదీ సాయత్రం 4 గంటల వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
అలాగే 17వ తేదీన ఓటు లెక్కింపు కేంద్రాల ప్రాంతాల్లోని వైన్ షాపులు ఈ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు మూసి వేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు లేనంతగా ఈసారి పట్టభద్రుల ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. తెలంగాణలో ఆరు ఉమ్మడి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండడంతో ఈ ఫలితాలు భవిష్యత్తు రాజకీయాలను ప్రభావితం చేస్తాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకే అన్ని పార్టీలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి.