Telangana: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోరు

Telangana: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోరు సాధారణ ఎన్నికలను తలపిస్తుంది

Update: 2021-02-20 04:35 GMT

Representational Image

Telangana: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోరు సాధారణ ఎన్నికలను తలపిస్తుంది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మల్సీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల కోసం అభ్యర్ధులు గ్రాడ్యుయేట్లను కలుస్తూ ప్రచారం చేస్తున్నారు. మరో వైపు ప్రత్యర్ధులపై ఆరోపణలు, ప్రత్యారోపణలు సంధించుకుంటున్నారు.

తెలంగాణలో గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్ధులు ఒక్కో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్లు వేసి సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. అన్ని పార్టీలతో పాటు స్వతంత్ర్య అభ్యర్ధులు తమ అనుచరులు, మద్దతుదారులతో నామినేషన్లు వేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

నామినేషన్లు, ప్రచారం ఒక ఘట్టం అయితే పట్టభద్రులను ఆకర్శించేందుకు అభ్యర్ధులు మార్నింగ్ వాక్ లతో పాటు పాదయాత్ర ,వాహనయాత్రలు చేస్తున్నారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్ధులు అంతా ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారు ఎక్కువగా ఉన్నారు దీంతో తమదైన శైలిలో ప్రత్యర్ధులపై భాణాలు సందిస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తిరిగి టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్సీగా ప్రభుత్వంతో చేయించిన పనులు ,ఉద్యోగాలకు సంబంధించిన అంశాలను గ్రాడ్యుయేట్ల ముందు ఉంచుతున్నారు.

స్వతంత్ర అభ్యర్ధి తీన్మార్ మల్లన్న, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ తమ మద్దతు దారులతో కలిసి మూడు జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం చేపడుతున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఏం సాధించారని ప్రశ్నిస్తున్నారు.

యువతెలంగాణ తరపున ఎమ్మెల్సీ బరిలో నిలిచిన రాణిరుద్రమ ఇప్పటికే అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ గా ఉన్నపుడు ఎం సాధించారో తాను చర్చలకు సిద్దమని ప్రకటించింది .ఓక మహిళగా తనకు అవకాశం ఇస్తే మండలిలో ప్రశ్నించే గొంతుక అవుతానని అంటొంది.

తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్ సైతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు..తనదైన శైలిలో అనుచరులతో కలిసి పర్యటిస్తున్నారు అటు ప్రభుత్వం పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాములు నాయక్ ,బిజెపి నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ,సుధగాని పౌండేషన్ చైర్మన్ హరిశంకర్ గౌడ్ ఇలా అభ్యర్ధులంతా క్షేత్రస్ధాయిలో పర్యటిస్తున్నారు .

Tags:    

Similar News