డిసెంబరు 3న టీబీఎఫ్ ఎక్స్పో బ్రోచర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
MLA Sudheer Reddy: టీబీఎఫ్ కృషితో తక్కువ ధరకు సొంత ఇళ్లు
MLA Sudheer Reddy: తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ నెల 3, 4 తేదీల్లో సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ప్రాపర్టీ ఎక్స్పోను నిర్వహించనున్నారు. ప్రాపర్టీ ఎక్స్పో బ్రోచర్‌ను ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆవిష్కరించారు. దేశంలోని ప్రముఖ ఎంఎన్సీ కంపెనీలన్ని పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ వైపు చూస్తున్నాయని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. టీబీఎఫ్ కృషితో ఈ ప్రాంతంలో ప్రజలకు తక్కువ ధరలలో సొంత ఇళ్లు అందుబాటులోకి రానుండడం శుభ పరిణామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు.