Padi Kaushik Reddy: స్పృహ కోల్పోయిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

Padi Kaushik Reddy: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై దాడి జరిగింది.

Update: 2024-11-09 09:06 GMT

Padi Kaushik Reddy:  హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పృహ కోల్పోయారు. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు ఆయనకు చికిత్స అందించారు.  దళితబంధు లబ్దిదారులకు రెండో విడత నిధులు మంజూరు చేయాలని ఆందోళన చేస్తున్న సమయంలో పోలీసులు, బీఆర్ఎస్ వర్గాల మధ్య తోపులాటలో కౌశిక్ రెడ్డి స్పృహ కోల్పోయారు.

అసలు ఏం జరిగింది?

దళితబంధు రెండో విడత నిధులు విడుదల చేయాలని కోరుతూ హుజురాబాద్ లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా ఉద్రిక్తతలకు దారి తీసింది. ధర్నాకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సమయంలో పోలీసులు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అయితే పోలీసులు బలవంతంగా ఎమ్మెల్యేను కారులోకి ఎక్కించారు. దీంతో ఆయన స్పృహ కోల్పోయారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.

పోలీసుల తీరుపై హరీష్ రావు మండిపాటు

కౌశిక్ రెడ్డి పై పోలీసుల తీరును మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా పోలీసులు కౌశిక్ రెడ్డిపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఈ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. దళితబంధు లబ్దిదారులకు రెండో విడత ఆర్ధిక సహాయం ఇవ్వాలని ఆయన కోరారు.

కౌశిక్ రెడ్డిపై దాడి చేస్తారా?: కేటీఆర్

ద‌ళితుల‌కు ద‌ళిత‌బంధు ఆర్థిక సాయం అడిగితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై దాడి చేస్తారా..? అని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిల‌దీశారు. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తే దాడి చేయ‌డ‌మేనా ఇందిర‌మ్మ రాజ్యం అంటే..? అని ప్ర‌శ్నించారు.

Tags:    

Similar News