ఉత్తమ్ కుమార్ గురించి మాట్లాడే హక్కు టీఆర్ఎస్ కు లేదు : జగ్గారెడ్డి
*నెహ్రూ గురించి అవాకులు, చవాకులు మాట్లాడొద్దు: జగ్గారెడ్డి *దేశానికి ఆస్తులు ధారాదత్తం చేసిన ఘనత నెహ్రూది : జగ్గారెడ్డి *అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ నేతల పని పడతాం: జగ్గారెడ్డి *తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ తప్పు చేసింది : జగ్గారెడ్డి
నెహ్రూ గురించి మాట్లాడే అర్హత టీఆర్ ఎస్ నేతలకు లేనేలేదంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. దేశం కోసం తన ఆస్తులను ఉచితంగా ఇచ్చేసిన ఘనత నెహ్రూదని అన్నారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం మూడు లక్షల కోట్ల అప్పులు చేసి ఆ భారం ప్రజలపై రుద్దుతోందని అన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరుతో మెగా సంస్థకు డబ్బు దోచిపెట్టారని జగ్గారెడ్డి ఆరోపించారు. తమ నాయకుడు ఉత్తమ్ కుమార్ పై కామెంట్స్ చేసే అర్హత మంత్రి జగదీశ్వర్ రెడ్డికి లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ నేతల బండారం బయటపెడతామని అన్నారు.