Medaram: సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను.. దర్శించుకున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క
Medaram: వచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం
Medaram: ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క దర్శించుకున్నారు. ముందుగా హెలికాఫ్టర్ ద్వారా మేడారం చేరుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ స్వాగతం పలికారు. సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నిలువెత్తు బంగారం సమర్పించి.. మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు.