Minister Talasani Srinivas Yadav Visits Osmania Hospital: ప్రతిపక్షాలకు మంచి చేసే ఆలోచన లేదు
Minister Talasani Srinivas Yadav Visits Osmania Hospital: పేదల కోసం 27 ఎకరాల్లో ఉస్మానియా ఆస్పత్రిని కొత్తగా నిర్మిస్తామంటే 2015లో ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
Minister Talasani Srinivas Yadav Visits Osmania Hospital: పేదల కోసం 27 ఎకరాల్లో ఉస్మానియా ఆస్పత్రిని కొత్తగా నిర్మిస్తామంటే 2015లో ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉస్మానియా ఆసుపత్రి భవనాలు కూలితే ప్రతిపక్షాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. ప్రతిపక్షాలకు మంచి చేసే అలోచన లేదని, బుధవారం వర్షం పడితే కాంగ్రెస్ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ప్రతి పక్ష నేతలు ఉస్మానియా ఆసుపత్రిలోకి నీళ్లు వచ్చినంత మాత్రాన హంగామా చేస్తారా అని నిలదీశారు. సీఎం కేసీఆర్ కు ప్రజల ఆరోగ్యంపై ప్రణాళిక ఉందని తెలిపారు. తెలంగాణలో ఉన్న ధరిద్రమైన ప్రతిపక్షాలు దేశంలో మరెక్కడా లేవని మండిపడ్డారు.
2015లో తెలంగాణ ప్రభుత్వం ఉస్మానియా ఆస్పత్రిని కూల్చి అక్కడ కొత్త భవనాన్ని నిర్మిస్తామన్నామని ప్రణాళిక వేసిందని, కానీ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, వీహెచ్‌లు అడ్డుకున్నారని విమర్శించారు. వారసత్వ కట్టడం అయితే ఉస్మానియాను బాగుచేయకూడదా? అని ప్రశ్నించారు. వీటికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్‌ని మీడియాకు చూపించారు. తెలంగాణ హై కోర్టు ప్రజల ప్రాణాలు దృష్టిలో పెట్టుకుని ఉస్మానియా ఆసుపత్రి కేసును సూమోటాగా తీసుకుని, పరిష్కరించాలని కోరారు. ప్రజలకు ఏదైనా జరిగితే ప్రతిపక్షాలదే బాధ్యత అని హెచ్చరించారు. భవిష్యత్తులో పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని మంత్రి తలసాని పేర్కొన్నారు.