చేతనైతే సహాయం చేయండి..లేకపోతే ఇంట్లో కూర్చోండి- మంత్రి తలసాని
Talasani Srinivas Yadav: కరోనా కట్టడిపై జీహెచ్ఎంసీలో మంత్రుల సమావేశం జరిగింది.
Talasani Srinivas Yadav: కరోనా కట్టడిపై జీహెచ్ఎంసీలో మంత్రుల సమావేశం జరిగింది. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఇంటింటికి సర్వే జరుగుతోందని, 9 లక్షల మందికి పరీక్షలు చేశామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద అన్నపూర్ణ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మెడిసిన్ విషయంలో కేంద్రం సహకరించాలని కోరారు. అంబులెన్స్‌లు ఆపే విషయాన్ని ఇష్యూ చేయడం సమంజసం కాదన్నారు.
తెలంగాణ ప్రభుత్వానికి మానవతా దృక్పథం ఉందని తెలిపారు. కరోనా విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు, నేతలకు మంత్రి తలసాని ఉచిత సలహా ఇచ్చారు. చేతనైతే సహాయం చేయండి..లేకపోతే ఇంట్లో కూర్చోండి అంటూ వ్యాఖ్యానించారు. బెడ్స్ ఖాళీగా ఉంటే ఎవరైనా వచ్చి చికిత్స చేసుకోవచ్చు... కానీ మనకే ఖాళీ లేని బెడ్స్ మీద ఆలోచించాలి అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.