Singireddy Niranjan Reddy: తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దే

MLA Niranjan Reddy: రాష్ట్రంలోని రైతులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు సాయం అందించిన విషయం తెలిసిందే.

Update: 2020-07-01 12:00 GMT

Singireddy Niranjan Reddy: రాష్ట్రంలోని రైతులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు సాయం అందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఆకలిదప్పుల తెలంగాణ నుంచి అన్నపూర్ణ తెలంగాణగా మార్చిన ఘనత సీఎం కెసీఆర్‌ కే దక్కుతుందని మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 36 గంటల్లో రైతులకు రూ.7వేల కోట్లను అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఆయన అన్నారు. ఇప్పటి వరకు నాలుగో విడత రైతుబంధు ద్వారా రూ. 55 లక్షలు ఆర్థిక సాయాన్ని 6వేల మంది రైతులకు రైతుబంధు పథకంలో భాగంగా వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. రాష్ట్రంలో కోటి 50లక్షల ఎకరాల సాగు భూమికి రైతుబంధు పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

ఇంత పెద్ద మొత్తంలో రైతులకు ఆర్థిక స్వావలంబన కల్పించినందుకు రాష్ట్ర రైతాంగం తరుఫున సీఎం కెసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాని ఆయన చెప్పారు. రైతుబంధు సాయం అందని రైతులందరు తమ ఖాతాల వివరాలను పేర్లను, సరిచేసి సంబందిత వ్యవసాయ అదికారులకు అందించాలని, ఈ తరువాత రైతులు రైతుబంధు సహాయాన్ని పొందాలని సూచించారు. ఇప్పటి వరకు 28వేల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు సాయం పడలేదని, వివరాలు సరిగ్గా లేనందున పంపిణీ చేసిన నగదు వాపస్‌ వచ్చిందని మంత్రి తెలిపారు. రైతుబంధు సహాయం రైతులకు అందేందుకు కృషి చేసిన వ్యవసాయ, ఆర్థిక శాఖ కార్యదర్శులు, సిబ్బందికి మంత్రి నిరంజన్‌ రెడ్డి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, కౌన్సిలర్లు , టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 


Tags:    

Similar News