Seethakka: మహిళల భద్రతపై మంత్రి సీతక్క సమీక్ష
Seethakka: మహిళలు భయపడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటాం
Seethakka: మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి సీతక్క. మహిళా భద్రతపై సమీక్ష నిర్వహించిన సీతక్క.. ఐదు రోజుల పాటు రాష్ట్రంలో స్పెషల్ డ్రైవ్ చేపడతామన్నారు. మహిళలపే దగ్గర వ్యక్తులే వేధించడం బాధాకరం అన్న సీతక్క.. వారిలో మనో స్థైర్యం నింపేలా స్పెషల్ యాక్షన్ చేపడతామని తెలిపారు. విద్యాసంస్థలతో పాటు పురుషులకు వేధింపులకు గురిచేయకుండా అవగాహన కల్పిస్తామన్నారు. అందుకోసం మహిళా మంత్రులతో పాటు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు.