Hyderabad: బంజారాహిల్స్‌లోని డీఏవీ స్కూల్‌పై వేటు
*డీఏవీ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు వేరే పాఠశాలకు బదిలీ
Hyderabad: బంజారాహిల్స్‌లోని డీఏవీ స్కూల్‌పై వేటు పడింది. తక్షణమే గుర్తింపు రద్దు చేయాలని మంత్రి సబిత ఆదేశించారు. వెంటనే గుర్తింపు రద్దు చేయాలని డీఈవోకు ఆదేశించారు. రెండు రోజుల క్రితం డీఏవీ స్కూల్లో లైంగిక వేధింపుల నిర్వాకం బయటపడింది. డీఏవీ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు వేరే పాఠశాలకు పంపించనున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అవకుండా చర్యలకు మంత్రి ఆదేశించారు. విద్యాశాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటుకు మంత్రి ఆదేశించారు.