Malla Reddy: డీజే పాటలకు స్టెప్పులేసిన మంత్రి మల్లారెడ్డి

Malla Reddy: మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో తెలంగాణ రన్

Update: 2023-06-12 05:01 GMT

Malla Reddy: డీజే పాటలకు స్టెప్పులేసిన మంత్రి మల్లారెడ్డి

Malla Reddy: మంత్రి మల్లన్న ఏం చేసినా జనం కేరింతలు మస్ట్. మాట్లాడినా.. పాట పాడినా... స్టెప్పులేసినా... మల్లన్న స్టయిలే సెపరేటు. అందుకే మల్లన్న సభలంటే జనం తెగ సంబపడిపోతారు. తాజాగా మంత్రి మల్లారెడ్డి.. మరోమారు ప్రజల్లో జోష్ తెప్పించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మేడ్చల్ జిల్లాలో నిర్వహించిన తెలంగాణ రన్‌లో మంత్రి చామకూర మల్లారెడ్డి స్టెప్పులేసి అందరినీ ఆకట్టుకున్నారు.

మేడిపల్లిలో తెలంగాణ రన్ ఉత్సాహంగా.. ఉల్లాసంగా సాగింది. ఈ రన్‌లో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మంత్రి మల్లారెడ్డి, మేడ్చల్ కలెక్టర్ అమోయ్, సీపీ దేవేంద్ర సింగ్ చౌహాన్, డీసీపీ జానకి దరావత్ తదితరులు పాల్గొన్నారు. ఏవీ ఇన్‌ఫ్రా గ్రౌండ్ ఆవరణలో సంతోష్ మొక్కలు నాటారు.

దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్ వన్‌గా అభివృద్ధి చెందిందన్నారు మంత్రి మల్లారెడ్డి. తెలంగాణ రన్‌ కోసం భారీగా తరలివచ్చిన యువతీయువకులు, విద్యార్థులను మంత్రి మల్లన్న ఉత్సాహ పరుస్తూ.. డీజే పాటలకు స్టెప్పులు వేశారు... మల్లన్న డ్యాన్సుకు యువతీయువకులు కేరింతలు కొట్టారు. 

Tags:    

Similar News