కరీంనగర్ జిల్లాలో రైతు వేదికలను ప్రారంభించిన మంత్రులు

Update: 2021-02-05 09:16 GMT

Representational Image

ఒక మంత్రి ఢిల్లీపై నిప్పులు చెరిగితే మరో మంత్రి రైతులకి ఇక సమస్యలుండవంటూ సాప్ట్‌గా చెప్పేశారు ఇవి ఒకే సమయంలో అయినప్పటికీ వేదికలు మాత్రం వేరు వేరు. కరీంనగర్ జిల్లాలో ఒకే రోజు ఒకేసారి ఒకే సందర్భంలో ఇద్దరు మంత్రుల భిన్న స్వరాలు వినిపించారు. ఇంతకు వారెవరు?

కరీంనగర్ జిల్లాలో గురువారం జరిగిన రైతు వేదిక ప్రారంభోత్సవాలు ఆసక్తికరంగా మారాయి. హుజురాబాద్ నియోజకవర్గంలో మంత్రి ఈటల రాజేందర్ రైతు వేదికలను ప్రారంభించారు. కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల్లో మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు. వీరిద్దరు రైతుల గురించి భిన్న స్వరాలు వినిపించారు.

అయితే హుజురాబాద్ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ కాస్త ఘాటుగా ఆరోగ్యశాఖ మంత్రి ఈటల తనదైన శైలీలో వ్యాఖ్యలు చేశారు ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి తాను ఎప్పుడు అండగా ఉంటానని చెప్పారు.

కానీ, ఇటు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాత్రం సాప్ట్ గా ప్రతిపక్షాలు, కేంద్రంపై రైతుల పోరాటం లాంటివి లేకుండా మాట్లాడేసి వెళ్లిపోయారు. అంతేకాదు వెళ్తూ వెళ్తూ ఈటల ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటూ జిల్లా నాయకులను వాకబు చేస్తూ వెళ్లారట.

ఇలా ఒకే జిల్లాలో రెండు వేరు వేరు ప్రాంతాల్లో ఒకే కార్యక్రమం చేస్తూ భిన్నమైన కామెంట్స్‌తో కరీంనగర్ జిల్లాలో రైతు వేదిక ప్రారంభోత్సవాలు జరిగాయి. అయితే వ్యవసాయ శాఖ మంత్రి నోటి నుండి రావాల్సిన ఇలాంటి అంశాలు ఆరోగ్య శాఖ మంత్రి నుండి రావడం ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News