నేడు ఖమ్మంలో ఐటీ పార్క్‌ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
ఖమ్మం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఐటీ పార్క్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. 42 వేల చదరపు అడుగుల వైశాల్యంలో ఐదు అంతస్థుల్లో ఉన్న ఈ టవర్‌ను.. 27 కోట్ల వ్యయంతో నిర్మించారు.
ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఐటీ పార్క్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. 42 వేల చదరపు అడుగుల వైశాల్యంలో ఐదు అంతస్థుల్లో ఉన్న ఈ టవర్‌ను.. 27 కోట్ల వ్యయంతో నిర్మించారు. మంత్రి కేటీఆర్‌తో పాటు ముగ్గురు మంత్రులు మహమూద్ అలీ, ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్ ఇవాళ ఖమ్మంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా 215 కోట్లతో పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు.
ఉదయం 10 గంటలకు ఖమ్మం చేరుకోనున్న కేటీఆర్.. ఖానాపురం మినీ ట్యాంక్‌బండ్, బల్లేపల్లి వైకుంఠధామం, ఖమ్మం-ఇల్లెందు రోడ్డు అభివృద్ధి, సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవంతో పాటు కోయచెలక రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. రఘునాథపాలెం-వీవీపాలెం అర్‌అండ్‌బీ రోడ్డు, రఘునాథపాలెం మినీ ట్యాంక్‌బండ్‌ను ప్రారంభించనున్నారు మంత్రి కేటీఆర్. మధ్యాహ్నం లకారం ట్యాంక్‌బండ్ జంక్షన్‌లో పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఆవిష్కరించి కొత్త ఓవర్‌బ్రిడ్జి, సెంట్రల్ లైటింగ్, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.