Minister KTR: ఆ విషయంలో మోడీ సర్కార్ చరిత్రలో నిలుస్తుంది..
Minister KTR: కేంద్ర ఆర్థిక విధానాలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
Minister KTR: కేంద్ర ఆర్థిక విధానాలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ప్రధాని మోడీ అస్తవ్యస్త, అనాలోచిత నిర్ణయాలతో దేశ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని విమర్శించారు. అత్యంత దారుణమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకున్న దరిద్రపు ప్రభుత్వంగా మోడీ సర్కార్ దేశ చరిత్రలో నిలిచిపోతుందని ఎద్దేవా చేశారు. ఎన్నడూ లేనంతగా రూపాయి బలహీనపడిందన్నారు. 30 ఏళ్లలో అత్యధిక ద్రవ్యోల్బణం, 45 ఏళ్లలో అత్యధిక నిరుద్యోగం మోడీ హయాంలోనే ఉందని ఫైర్ అయ్యారు.
పెన్సిల్ నుంచి ఆస్పత్రి బెడ్లు చివరకి అంత్యక్రియల వరకు పన్నులు వేసి ప్రజలను దోచుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. మోడీ వైఫల్యాలను ఎండగడితే కేంద్ర దర్యాప్తు సంస్థలతో కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. అబద్ధపు మాటలతో పార్లమెంట్‌లో బయటపడినా ప్రజల ముందు దోషిగా నిలబడాల్సిందేననీ ఆయన అన్నారు.