అప్పుడూ అండగా ఉన్నాం.. ఇప్పుడూ ఉంటాం.. కందికొండ కుమార్తె లేఖపై మంత్రి కేటీఆర్ స్పందన

* కందికొండ కుమార్తె లేఖపై ట్విట్టర్ లో స్పందించిన కేటీఆర్

Update: 2021-12-05 08:26 GMT

కందికొండ కుమార్తె లేఖపై మంత్రి కేటీఆర్ స్పందన

KTR Tweet: సినీ గేయ రచయిత కందికొండ కుమార్తె మాతృక తమ కుటుంబ పరిస్థితి వివరిస్తూ సాయం చేయాలని మంత్రి కేటీఆర్​కు చేసిన ట్వీట్​పై ఆయన స్పందించారు. గత కొంతకాలంగా క్యాన్సర్​తో తీవ్ర అనారోగ్యానికి గురైన కందికొండకు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స చేయించి ఆర్థికపరమైన అవసరాలకు కేటీఆర్ ఆదుకున్నారు. తాజాగా క్యాన్సర్ నుంచి కోలుకుని చికిత్స పొందుతున్న కందికొండకు ఇంటి విషయంలో ఆర్ధిక ఇబ్బందులు ఎదురయ్యాయి.

మోతీనగర్​లో ఉన్న అద్దె ఇల్లు ఖాళీ చేయాల్సిందిగా ఇంటి యజమాని ఒత్తిడి తెస్తుండటంతో కందికొండ కుమార్తె తమని ఆదుకోవాలని కేటీఆర్​కు లేఖ రాశారు. చిత్రపురి, ఇంకెక్కడైన తమకి నివాసం కల్పించాలని మంత్రి కేటీఆర్ ని కోరింది. మాతృక రాసిన లేఖపై స్పందించిన మంత్రి కేటీఆర్ కందికొండ కుటుంబానికి అండగా ఉంటామని, మంత్రి తలసానితో పాటు తన కార్యాలయ సిబ్బందితో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించేలా చూస్తామని మాతృకకి హామీ ఇచ్చారు.

సినీ గేయ రచయిత కందికొండ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రంలోని "మళ్ళీ కూయవే గువ్వ".., పోకిరిలో "గల గల పారుతున్న గోదారిలా", ఇడియట్ చిత్రంలో " చూపుల్తో గుచ్చి గుచ్చి" వంటి తదితర పాటలు రాశారు.


Tags:    

Similar News