కేటీఆర్‌ ప్రసంగంపై విశ్వకర్మలు ఆగ్రహం.. విశ్వబ్రాహ్మణులను తాను కించపర్చలేదని కేటీఆర్‌ క్లారిటీ..

Vishwa Brahmins: మంత్రి కేటీఆర్ విశ్వ బ్రాహ్మణులపై చేసిన వ్యాఖలు వివాదాస్పదంగా మారాయి.

Update: 2022-07-02 13:45 GMT

కేటీఆర్‌ ప్రసంగంపై విశ్వకర్మలు ఆగ్రహం.. విశ్వబ్రాహ్మణులను తాను కించపర్చలేదని కేటీఆర్‌ క్లారిటీ..

Vishwa Brahmins: మంత్రి కేటీఆర్ విశ్వ బ్రాహ్మణులపై చేసిన వ్యాఖలు వివాదాస్పదంగా మారాయి. విశ్వ బ్రాహ్మణులు నిరసన వ్యక్తం చేశారు. కేటీఆర్ క్షమాపణలు చెప్పాలంటూ ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. శ్రీకాంత్ ఆచారి అమరుడైనాడు కాబట్టే ఈ రోజు మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ చారి అనే వారు లేకపోతే ఈ రోజు మీరు ఎక్కడ ఉండేవారు అని నిలదీశారు. కేసీఆర్, కేటీఆర్ ఖబర్దార్ తక్షణమే చారిలకు క్షమాపణ చెప్పాలని విశ్వబ్రాహ్మణులు డిమాండ్ చేశారు.

అయితే విశ్వబ్రాహ్మణులను తాను కించపర్చలేదని మంత్రి కేటీఆర్‌ క్లారిటీ ఇచ్చారు. కొంతమంది కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక కులాన్ని లేదా ఒక వర్గాన్ని తక్కువ చేసి మాట్లాడే నీచున్ని కాదన్నారు. కేవలం ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఒక నాయకుడిని ఉద్దేశించి అన్న మాట వల్ల ఎవరైనా బాధపడితే ఆ మాటని ఉపసంహరించుకుంటున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. 

Tags:    

Similar News