Minister KTR: కాంట్రాక్టుల కోసం రాజగోపాల్ రెడ్డి కక్కుర్తి పడటం వల్లే.. మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది

Minister KTR: కాంట్రాక్టు ఒప్పందం లేకపోతే ఆ కాంట్రాక్టు వదులుకోవాలి

Update: 2022-10-11 12:00 GMT

Minister KTR: కాంట్రాక్టుల కోసం రాజగోపాల్ రెడ్డి కక్కుర్తి పడటం వల్లే.. మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది

Minister KTR: మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని మంత్రి కేటీఆర్ అన్నారు. మునుగోడు అభివృద్ది కోసం జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సమర్ధిస్తున్నామన్నారు. ఓ కాంట్రాక్టర్ స్వలాభం కోసం చేసిన కుట్రలతోనే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందన్నారు. ఫ్లోరోసిస్ నిర్మూలన కోసం 19వేల కోట్లు ఇవ్వాలని నీతి అయోగ్‌ సిఫార్సు చేస్తే కేంద్ర ప్రభుత్వం మాత్రం రాజగోపాల్‌రెడ్డికి కాంట్రాక్టులు ఇచ్చి ఉప ఎన్నిక తెచ్చారని మండిపడ్డారు. ఈసందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే జుమ్లా లేకపోతే ఆమ్లా అనేది మోడీ స్టైల్ అన్న కేటీఆర్ గుజరాత్ నుంచి వచ్చి ఇక్కడ రాజకీయం చేయాలని చూస్తూ ఊరుకోబోమన్నారు. మునుగోడు ఉపఎన్నిక ఒక చిన్న యూనిట్ టెస్ట్ మాత్రమేనన్న కేటీఆర్ తనకు కాంట్రాక్ట్ స్వతహాగా రాకపోతే ఆ కాంట్రాక్టు వదులుకోవాలన్నారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జ్ తో విచారణ చేయించాలన్నారు.

Tags:    

Similar News