Ask me పేరుతో ట్విట్టర్లో నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం ఇస్తున్న మంత్రి కేటీఆర్
Minister KTR Answering Questions : తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో నెటిజన్లు అడిగే ప్రశ్నలకు జవాబులు ఇచ్చే కార్యక్రమాన్ని షురూ చేశారు.
Minister KTR Answering Questions : తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో నెటిజన్లు అడిగే ప్రశ్నలకు జవాబులు ఇచ్చే కార్యక్రమాన్ని షురూ చేశారు. Ask me పేరుతో ట్విట్టర్లో నెటిజన్లు అడిగే ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తున్నారు. ఆస్క్ కేటీఆర్ హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో నిర్వహించే కార్యక్రమంలో ఓ నెటిజన్ ఆరోగ్యశ్రీపై కేటీఆర్ ను ప్రశ్నించాడు. అంతే కాకుండా చాలా మంది ప్రజలు వివిధ సమస్యలను ట్విట్టర్ ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకు వస్తున్నారు. అందుకు కేటీఆర్ వెంటనే స్పందించి నెటిజన్లకు బదులిస్తూ ఆయా శాఖలను అలర్ట్ చేస్తున్నారు. అంతే కాదు ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ కేసీఆర్ తర్వాత నాకు ఇష్టమైన నా రాజకీయ నాయకుడు మాజీ అమెరికా అధ్యక్షుడు ఒబామా అని బదులిచ్చారు. హైదరాబాద్ కి త్వరలోనే పెద్ద పరిశ్రమలు రాబోతున్నాయి వివరాలు త్వరలో ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
అనంతరం ప్రయివేటు ఆస్పత్రులపై వచ్చిన ఫిర్యాదుల పట్ల స్పందించిన ఆయన స్పందించారు. ఇప్పటికే కొన్ని ఆసుపత్రులపై చర్యలు తీసుకున్నాం అని ఆయన తెలిపారు. టీ ఫైబర్ ఏడాది కాలంలో అందుబాటులోకి వస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో మంచి చికిత్స అందిస్తున్నారు. ప్రజలు ప్రభుత్వ సేవల్ని వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిరోజు 23 వేల కరోనా టెస్టు నిర్వహిస్తున్నామని తెలిపారు. 40 వేల టెస్ట్ నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలంగాణలో మరణాల సంఖ్య ఒక్క శాతం కంటే తక్కువగానే ఉంది. దేశంలోనే ఇది తక్కువ అని ఆయన తెలిపారు. కరోనా కారణంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ పనులు ఆలస్యమవుతున్నాయి. కమాండ్ కంట్రోల్ రూమ్ హైదరాబాద్ నగరానికే కాదు దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సచివాలయ జి బ్లాక్ కింద నిధులు ఉన్నాయని ప్రతిపక్షాల ఆరోపణలు వారి వైల్డ్ ఇమేజినేషన్ మాత్రమే అని అన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో యువత పాలుపంచుకోవాలని కోరారు. యువత ఉదాసీనంగా ఉండడం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మనకు ప్రమాదకరం అని అన్నారు. అగస్టు మూడో వారంలో దుర్గం చెరువు తీగల వంతెన ప్రారంభిస్తారని ఆయన స్పష్టం చేసారు. జగన్ తో మాకు మంచి సంబంధాలే ఉన్నాయి... కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడము అని ఓ నెటిజన్ కు సమాధానం ఇచ్చారు.