KTR: డీప్‌ఫేక్‌లతో అప్రమత్తంగా ఉండండి.. బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలకు సూచించిన మంత్రి కేటీఆర్
KTR: రాబోయే 5 రోజుల్లో ఫేక్ వీడియోలు, ఫేక్ న్యూస్ ప్రచారం చేసే ఛాన్స్
KTR: ఎన్నికల్లో ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ రానున్న 4-5 రోజుల్లో అనేక ఫేక్ వీడియోలు, ఫేక్ వార్తలు ప్రచారం చేసే అవకాశం ఉందని... బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇలాంటి ఫేక్ ప్రచారం వల్ల ఓటర్లు ప్రభావితం కాకుండా చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ ద్వారా కార్యకర్తలకు సూచించారు.