మాకు ప్రజలే హైకమాండ్ : హరీష్ రావు
తమకు ప్రజలే హైకమాండ్ అన్నారు మంత్రి హరీష్ రావు. పనిచేసే వారిని ఎన్నికల్లో గెలిపించాలన్నారు ఆయన. పరాయి పార్టీల వారు దుబ్బాకలో ప్రచారం చేశారన్న మంత్రి హరీష్ రావు.. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల పార్టీ అన్నారు.
తమకు ప్రజలే హైకమాండ్ అన్నారు మంత్రి హరీష్ రావు. పనిచేసే వారిని ఎన్నికల్లో గెలిపించాలన్నారు ఆయన. పరాయి పార్టీల వారు దుబ్బాకలో ప్రచారం చేశారన్న మంత్రి హరీష్ రావు.. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల పార్టీ అన్నారు. ఇక దుబ్బాకలో చివరి వరకు ఉండేది టీఆర్ఎస్‌యే అని స్పష్టం చేశారు. రఘునందన్‌రావు ఇంట్లో ఐదుగురికి రైతు బంధు ఉన్నట్లు తెలియజేశారు మంత్రి హరీష్ రావు. అదేవిధంగా అందరీలాగే రఘునందన్‌రావు తల్లిదండ్రులకు పించన్ ఇస్తున్నట్లు చెప్పారు ఆయన. ఇక తల్లిదండ్రులను చూడని రఘునందన్‌రావు.. పార్టీ కార్యకర్తలన ఏం చూస్తారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. దుబ్బాక అభివృద్ధి కోసం టీఆర్ఎస్‌ను గెలిపిద్దామన్నారు మంత్రి హరీష్ రావు..
ఇక టీఆర్ఎస్ నేత సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్య సమస్యలతో ఆగస్టు నెలలో మరణించడంతో అక్కడ ఉపఎన్నికలు అనివార్యం అయ్యాయి.. ఈ క్రమంలో నవంబరు 3న పోలింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆయా పార్టీలు అభ్యర్ధులను కూడా ప్రకటించాయి.. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత, కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు పోటిలో ఉన్నారు.ఇక నవంబర్ 3 న ఎన్నికలు జరగగా, 10 న ఫలితాలు రానున్నాయి.