టీఆర్ఎస్‌కు ఎందుకు ఓటేయాలో ఓటర్లకు వివరించండి: మంత్రి హరీష్

Update: 2021-02-27 10:28 GMT

టీఆర్ఎస్‌కు ఎందుకు ఓటేయాలో ఓటర్లకు వివరించండి: మంత్రి హరీష్

ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార టీఆర్ఎస్ దూకుడు పెంచింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశానికి మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. 70 నుంచి‌ 80 శాతం ఓటింగ్ జరిగేలా చూడాలని, ఓటింగ్ శాతం పెరిగితే టీఆర్‌ఎస్‌దే విజయమన్నారు. బీజేపీకి, కాంగ్రెస్ పార్టీలకు‌ లేని నెట్‌వర్క్ తమకు ఉందని, కష్టపడి పని చేస్తే గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. ప్రతి ఓటరును నేరుగా కలిసి టీఆర్ఎస్‌కు ఎందుకు ఓటేయాలో వివరించాలని శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు.

Tags:    

Similar News