Harish Rao: చేనేత కార్మికులకు కేంద్రం ఏం చేసింది?

Harish Rao: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని ప్రశ్నించిన హరీష్‌రావు

Update: 2022-09-28 09:10 GMT

Harish Rao: చేనేత కార్మికులకు కేంద్రం ఏం చేసింది?

Harish Rao: చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. ఆల్‌ ఇండియా హ్యాండీక్రాప్ట్‌ బోర్డు, పవర్‌లూమ్‌ బోర్డులను కేంద్రం రద్దు చేసిందని మండిపడ్డారు. చేనేత కార్మికులను అనేక రకాలుగా రోడ్డున పడేసిందని దుయ్యబట్టారు. మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌కు కేంద్రం రూపాయి కూడా అందించలేదని చెప్పారు. తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా చింతా ప్రభాకర్ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన హరీష్‌రావు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ చేనేత రంగానికి చేసిందేమీ లేదని.. నేతన్న బీమా కింద తెలంగాణ ప్రభుత్వం ఐదు లక్షల సహాయం చేస్తోందని చెప్పారు.

hmtv బతుకమ్మ పాట 2022 కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Tags:    

Similar News