MP Asaduddin Owaisi To Meet CM KCR : సీఎం కేసీఆర్‌ను కలవనున్న ఎంఐఎం అధినేత

MP Asaduddin Owaisi To Meet CM KCR : తెలంగాణలో కొత్త సచివాలయం భవనాన్ని నిర్మించేందుకు పాత సచివాలయ భవనాన్నితెలంగాణ ప్రభుత్వం కూల్చివేసిన విషయం తెలిసిందే.

Update: 2020-09-05 05:26 GMT

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఫైల్ ఫోటో

MP Asaduddin Owaisi To Meet CM KCR : తెలంగాణలో కొత్త సచివాలయం భవనాన్ని నిర్మించేందుకు పాత సచివాలయ భవనాన్నితెలంగాణ ప్రభుత్వం కూల్చివేసిన విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే సచివాలయం పరిసరాలలో ఉన్న రెండు మసీదులను సైతం కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ను హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఈ రోజు సమావేశం కానున్నారు. ప్రగతి భవన్‌లో ఈ రోజు మధ్యాహ్నం ఆయన సీఎంతో భేటీ కానున్నారు. కాగా ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు, ఇతర ముస్లిం సంస్థల ప్రతినిధులతో కూల్చివేసిన మసీదుల పునర్నిర్మాణం విషయం గురించి చర్చించేందుకు సీఎం కేసీఆర్‌ను కలుస్తున్నట్టు అసదుద్దీన్‌ ట్విట్టర్‌లో వెల్లడించారు.

ఇక పోతే తెలంగాణ సెక్రటేరియట్ పాత ఎత్తయిన భననాలను కూల్చివేస్తున్న సమయంలో దాని సమీపంలో ఉన్న అమ్మవారి ఆలయం, అదే విధంగా మసీదులపైన భవనం శిథిలాలు పడి కొంత నష్టం జరిగింది. ఈ విషయం సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లగానే ఆయన ఈ విషయంపట్ల ఆవేదన వ్యక్తం చేశారు. పాత భవనాలను కూల్చి ఆ స్థానంలో కొత్త భవనాలను నిర్మించడమే ప్రభుత్వ ఉద్దేశ్యం అని, అంతే కాని ప్రార్థనా మందిరాలను తొలగించడం, వాటికి ఇబ్బంది కలిగించడం ప్రభుత్వ ఉద్దేశం కాదని సీఎం కేసీఆర్ అన్నారు. దెబ్బ తిన్న మసీదులను, అలాగే ఆలయాన్ని పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఎక్కువ విస్తీర్ణంలో విశాలంగా ఉండే విధంగా ఎన్నికోట్లైనా ఖర్చు చేసి వీటిని పున:నిర్మిస్తామని ఆయన అప్పుడు తెలిపారు. దేవాలయం, మసీదు నిర్వాహకులతో సీఎం త్వరలోనే సమావేశమవుతానని అప్పట్లో హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ సమావేశం నిర్వహించనున్నారని సమాచారం.

Tags:    

Similar News