Micro Houses: నూతన ఆవిష్కర్తలను ప్రోత్సహిస్తాం- ఎమ్మెల్సీ కవిత

Micro Houses: తక్కువ ఖర్చుతో సిమెంట్ పైపుల్లో ఇళ్లను నిర్మిస్తోంది యువతి పేరాల మానసరెడ్డి.

Update: 2021-04-12 11:58 GMT

Micro Houses: నూతన ఆవిష్కర్తలను ప్రోత్సాహిస్తాం- ఎమ్మెల్సీ కవిత

Micro Houses: తక్కువ ఖర్చుతో సిమెంట్ పైపుల్లో ఇళ్లను నిర్మిస్తోంది యువతి పేరాల మానసరెడ్డి. కరీంనగర్‌ జిల్లా బొమ్మకల్‌కు చెందిన మానస తెలంగాణ గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాల్లో ప్రాథమిక విద్యాభాసం పూర్తి చేసింది. సివిల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పొందిన అనంతరం వివిధ దేశాల్లో అక్కడి వాతావరణానికి అనుగుణంగా, తక్కువ ఖర్చుతో ఇళ్లను నిర్మిస్తున్న విధానాలను అధ్యయనం చేసింది.

ఇప్పుడు వాటి ఆధారంగా తక్కువ ఖర్చుతో ఇంటి డైజన్లను రూపొందించింది మానస. రెండు వేల మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన కాంక్రీట్‌ పైపులో, 120 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓపాడ్స్‌ లేదా మైక్రో ఇళ్లుగా పిలిచే ఇల్లును నిర్మించి ఔరా అనిపించింది. ఇండియాలోనే తొలిసారి నిర్మించే ఈ ఓపాడ్‌ ఇళ్లు 40 నుంచి 120 చదరపు అడుగుల విస్తీర్ణంలో నివసించడానికి వీలుగా తయారవుతుంది. ఈ ఇంటి నిర్మాణానికి 15 నుంచి 20 రోజులు పడుతోంది.

హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవితను కలిసిన మానస కొత్త పద్దతిలో ఇళ్లను నిర్మిస్తున్న విధానాన్ని వివరించారు. ఈ సందర్భంగా అతి తక్కువ ఖర్చుతో సిమెంటు పైపుల్లో ఇళ్లను నిర్మిస్తున్న మానసను అభినందించారు కవిత. నూతన ఆవిష్కరణలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందన్నారు. భవిష్యత్తులో మరిన్ని నూతన ఆవిష్కరణలతో, రాష్ట్రానికి గర్వకారణంగా నిలవాలని కవిత ఆకాంక్షించారు.

Full View


Tags:    

Similar News