Medaram: నేటి నుండి తెరుచుకోనున్నమేడారం ఆలయం

Medaram: వనదేవతలు కొలువై ఉన్నమేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం నేటి నుంచి తిరిగి తెరుచుకోనుంది.

Update: 2021-03-21 06:57 GMT

మేడారం:(ఫైల్ ఇమేజ్)

Medaram: వనదేవతలు కొలువై ఉన్నమేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం నేటి నుంచి తిరిగి తెరుచుకోనుంది. ఆలయ సిబ్బందికి కరోనా సోకడంతో ఈనెల 1న ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. గిరిజనులు ఆరాధ్య దైవంగా కొలిచే సమ్మక్క-సారలమ్మ చిన్న జాతర ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు నాలుగు రోజులపాటు జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. బెల్లం, చీరసారె, పూలుపండ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ క్రమంలో పలువురు భక్తులతోపాటు విధి నిర్వహణలో ఉన్న ముగ్గురు సిబ్బంది కరోనా వైరస్ బారినపడడంతో అప్రమత్తమైన అధికారులు ఆలయాన్ని మూసివేశారు. దాదాపు 20 రోజులపాటు ఆలయాన్ని మూసి వేసిన అధికారులు నేటి నుంచి మళ్లీ తెరవాలని నిర్ణయించారు.

Tags:    

Similar News