వరంగల్‌‌ మెడికల్‌ కాలేజీలో హైటెక్ కాపీయింగ్

Update: 2020-12-10 09:33 GMT

ఎంతో మంది గొప్ప గొప్ప వైద్యులను అందించిన ఘనత ఆ కాలేజ్‌ ది. అయితే ఇప్పుడు ఆ కాలేజ్‌ మరో రకంగా వార్తల్లో నిలిచింది. మైక్రోఫోన్స్‌ ఉపయోగించి మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడినా.. కాలేజ్‌ సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర‌‌్శల పాలైంది.

వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజ్‌లో హైటెక్‌ మాస్‌ కాపీయింగ్‌ వ్యవహారం బట్టబయలైంది. ఎంబీబీఎస్‌ పరీక్షల్లో ఓ విద్యార్థి చేతి వాటాన్ని ప్రదర్శించాడు. కాలేజ్‌ సిబ్బంది కళ్లుగప్పి మైక్రోఫోన్లతో ఎగ్జామ్‌ హాల్‌లోకి ప్రవేశించాడు. చెవిలో మైక్రోఫోన్‌ పెట్టుకుని మూడు పరీక్షలు రాశాడు.

కాకతీయ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయిర్ సప్లమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలకు హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు పీజీ విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఓ విద్యార్థి హైటెక్‌ పద్ధతిలో మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడ్డాడు. మైక్రోఫోన్‌ బ్లూటూత్‌ పెట్టుకుని పరీక్షలకు హాజరవగా మరో సీనియర్‌ విద్యార్థి పరీక్షా హాల్‌ బయట ఇన్నోవా వాహనంలో కూర్చొని ఆన్సర్స్‌ చేరవేశాడు. అయితే విద్యార్థులు చేసిన మాస్‌ కాపీయింగ్‌ తీరు అధికారులు, తోటి విద్యార్ధులను నివ్వెరపోయేలా చేసింది.

ఈనెల 2వ తేదీన మాస్‌ కాపీయింగ్‌ వ్యవహారాన్ని గుర్తించిన అధికారులు విద్యార్థి మొత్తం మూడు పరీక్షలు రాసినట్లుగా తెలియజేశారు. అయితే మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా వారిని వదిలేయడం పట్ల మెడికల్‌ కాలేజ్‌ అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయం మీడియా దృష్టికి రావడంతో కాకతీయ మెడికల్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ దిద్దుబాటు చర్యలకు దిగారు.

Full View


Tags:    

Similar News