Manda Krishna Madiga: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకు రాష్ట్రాలు త్వరగా ముందుకు రావాలి
సుప్రీం కోర్టులో ఈ జడ్జిమెంట్ రావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఉందని... మోడీ, అమిత్ షా, కిషన్ రెడ్డిలకు ధన్యావాదాలు తెలిపానన్నారు.
Manda Krishna Madiga: సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండ్ ఉన్న రాష్ట్రాలు అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీని కోరినట్లు మందకృష్ణ మాదిగ తెలిపారు. నవంబర్ 11న హైదారాబాద్ లో జరిగిన విశ్వరూప సభకు హాజరయిన మోడీ అప్పుడే తమ ఉద్యమానికి మద్దతు పలికినట్లు చెప్పారు.
సుప్రీం కోర్టులో ఈ జడ్జిమెంట్ రావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఉందని... మోడీ, అమిత్ షా, కిషన్ రెడ్డిలకు ధన్యావాదాలు తెలిపానన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు రాష్ట్రాలు ముందుకు రాకపోతే, సుప్రీం కోర్టు తీర్పును ఉల్లంఘించినట్లు అవుతుందని కేంద్రం రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేసేందుకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.