Nalgonda: కరోనాను జయించేందుకు కొత్త మార్గం
Nalgonda: ఆ యువకుడి ఒక్క ఐడియా కరోనానే జయించేలా చేస్తోంది.
Nalgonda: ఆ యువకుడి ఒక్క ఐడియా కరోనానే జయించేలా చేస్తోంది. ఓ కానుగ చెట్టునే ఐసోలేషన్‌గా చేసుకుని కరోనాపై యుద్ధమే మొదలుపెట్టాడు నల్గొండ జిల్లా యువకుడు. ఆలోచన ఉండాలే గానీ ఎంతటి రోగాన్నైనా అలవోకగా ఎదుర్కోవచ్చని నిరూపిస్తున్నాడు.
నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం కొత్తనందికొండకు చెందిన రమావత్ శివకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అసలే పేదరికం, ఆపై ఒకటే ఇళ్లు. ఆ ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు. వారిని ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో ఇంటి ముందున్న కానుగ చెట్టునే ఐసోలేషన్ వార్డుగా ఏర్పాటు చేసుకున్నాడు. చెట్టుపై మంచాన్ని ఏర్పాటు చేసుకొని గత 10రోజులుగా పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుతున్నాడు. మరో 4రోజుల్లో కరోనాను జయించి కిందకు దిగుతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు శివ.