Vikarabad: ఇంట్లో ఒకే గది ఉండటంతో ఐసొలేషన్‌కు తిప్పలు.. బాత్రూంలో ఐసొలేషన్

Vikarabad: కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతోంది.

Update: 2021-05-15 07:43 GMT

Vikarabad: ఇంట్లో ఒకే గది ఉండటంతో ఐసొలేషన్‌కు తిప్పలు.. బాత్రూంలో ఐసొలేషన్

Vikarabad: కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతోంది. పాజిటివ్‌ వస్తే 14 రోజుల పాటు ఐసొలేషన్ ఉండి చికిత్స పొందితే వైరస్‌ను జయించవచ్చు. అయితే వికారాబాద్ జిల్లా దారూర్ మండలం మైలారం గ్రామంలో మాత్రం కొవిడ్ పేషెంట్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. మైలారం గ్రామానికి చెందిన అశోక్ కు పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఆయనకు మూడు రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన ఇల్లు చిన్నది ఉండటానికి ఇబ్బంది కావడంతో బయట ఉన్న బాత్రూమ్‌ను ఐసొలేషన్‌గా ఏర్పాటు చేసుకున్నాడు.

అశోక్‌కు క్వారంటైన్ సౌకర్యం లేకపోవడంతో బాత్రూంలోనే ఉంటున్నాడు. తానుంటున్న పరిస్థితిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అధికారులు స్పందించారు. అశోక్‌ను అంబులెన్స్‌లో అనంతగిరి కొవిడ్ ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. ఇల్లు చిన్నదైనా తమ కుటుంబ సభ్యులను వైరస్ బారిన పడకుండా ఉండేందుకు కష‌్టమైన బాత్రూంలోనే ఉంటున్నట్టు ఆయన తెలిపారు.

Tags:    

Similar News