కేన్సర్‌తో ఆస్పత్రి‌లో చేరి.. కరోనాతో మృతి.. బిక్కుబిక్కు మంటున్న గ్రామస్థులు

కేన్సర్‌ వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన ఓ వ్యక్తి ఇటీవలే కరోనా వైరస్‌తో మృతి చెందాడు.

Update: 2020-06-08 08:14 GMT
District Medical Officer Sudhakarlal investigating with authorities

కేన్సర్‌ వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన ఓ వ్యక్తి ఇటీవలే కరోనా వైరస్‌తో మృతి చెందాడు. కాగా వైద్యులు అతని రిపోర్టులు రాకముందే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో వారు మృత దేహానికి దహనసంస్కారాలు చేసారు. అనంతరం మృతునికి కరోనా అని తేలండంతో అంతిసంస్కారంలో పాల్గొన్న మృతుని బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకెళితే 15 ఏళ్ల క్రితం నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూర్‌ మండలం వీరంరాజ్‌పల్లికి చెందిన ఓ వ్యక్తి బతుకుదెరువు కోసం సొంత గ్రామం నుంచి హైదరాబాద్‌ వలస వెళ్లారు.

అక్కడ కూలీ పనులు చేసుకుంటూ ఆయన భార్యా పిల్లలతో అల్వాల్‌ ప్రాంతంలోని నేతాజీనగర్‌లో జీవనం సాగిస్తున్నాడు. కాగా ఈ నెల 14వ తేదీన ఆ వ్యక్తి అనారోగ్యంతో అస్వస్థతకు గురయ్యాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు గొంతు కేన్సర్‌ వచ్చినట్టుగా గుర్తించారు. ఆ తరువాత బాధితున్ని కుటుంబ సభ్యులు లక్డికాపూల్‌ ఎంఎన్‌జే కేన్సర్‌ హాస్పిటల్‌లో చికిత్స నిమిత్తం చేర్పించారు. అక్కడి వైద్యులు చికిత్సలో బాగంగా అతని రక్త నమూనాలను ఈ నెల 5న సేకరించి కరోనా టెస్టులకు పంపించారు. నమూనాలు సేకరించిన తదుపరి రోజునే అంటే 6వ తేదీ ఉదయం 7 గంటల సమయంలో ఆయన మృతిచెందాడు.

తరువాత వైద్య సిబ్బంది మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. గుండెల నిండ బాధతో అతని కుమార్తె తన బంధువుల సాయంతో అంబులెన్స్‌లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్వగ్రామానికి తీసుకెళ్లారు. బంధువుల సమక్షంలో మృతదేహాన్ని ఖననం చేశారు. అదే రోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో హాస్పిటల్‌ సిబ్బంధి మృతునికి కరోనా పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చినట్లుగా సర్పంచ్‌ భర్త మనోహర్‌కు తెలియజేసారు. అనంతరం అధికారులకు ఈ విషయాన్నిచేరవేసారు. ఈ విషయం తెలియగానే అంత్యక్రియల్లో పాల్గొన్న 46 మంది బంధువులు ఒక్క సారిగా ఉలిక్కపడ్డారు. వివరాలు సేకరించిన డీఎంహెచ్‌ఓ 22 మందిని క్యారంటైన్‌కు తరలించే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మిగిలిన వారిని హోం క్వారంటైన్‌లో ఉంచడంతో పాటు, గ్రామం మొత్తాన్ని 14 రోజుల పాటు క్వారంటైన్‌ చేయాలని ఎస్‌ఐతో పాటు డాక్టర్లకు సూచించారు.


Tags:    

Similar News