Marriage: పెళ్లిని పెటాకులు చేసిన ఇన్‌స్టాగ్రామ్ మెస్సేజ్

Marriage: ఒక్క ఇన్‌స్టా మెస్సేజ్ ఓ పెళ్లిని పెటాకులు చేసింది. రెండు నెలల్లో జరగనున్న వివాహం కోసం ఆ యువకుడు బోలేడు కలలు కన్నాడు.

Update: 2021-03-19 09:54 GMT

Marriage: పెళ్లిని పెటాకులు చేసిన ఇన్‌స్టాగ్రామ్ మెస్సేజ్

Marriage: ఒక్క ఇన్‌స్టా మెస్సేజ్ ఓ పెళ్లిని పెటాకులు చేసింది. రెండు నెలల్లో జరగనున్న వివాహం కోసం ఆ యువకుడు బోలేడు కలలు కన్నాడు. పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాడు. భాజా బజంత్రీలు మోగడమే తరువాయి అనుకున్న క్షణాన అతడి ఫోన్‌కు ఓ మెస్సెజ్ వచ్చింది. ఆ మెస్సేజ్‌తో ఒక్కసారిగా ఆ యువకుడు షాక్‌కు గురయ్యాడు ఇంతకూ ఆ వివాహం ఎందుకాగింది? ఆ మెస్సేజ్‌లో అసలు ఏంముంది?

"నువ్వు పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి నాది.. ఆమెను గాఢంగా ప్రేమిస్తున్నా.. ఆమెనే పెళ్లి చేసుకుంటా.. నన్ను కాదని అడుగు ముందుకేశావో." ఇదీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లికొడుక్కి వచ్చిన మెస్సేజ్ సారాంశం. అయితే ఈ మెస్సేజ్‌ను మొదట్లో ఆ యువకుడు పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇలాంటి బెదిరింపు మెస్సేజ్‌లే తరచూ రావడంతో పెళ్లికొడుకులో కలవరం మొదలైంది. అసలు విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో పెళ్లి రద్దు చేసుకునే వరకూ వెళ్లింది. అసలు ఈ బెదిరింపుల వెనుక ఎవరున్నారు అన్న దిశగా ఆరా తీసిన అమ్మాయి పేరెంట్స్‌‌కు షాకింగ్ న్యూస్ తెలిసింది.

తమ కుమార్తె పెళ్లి రద్దు కావడానికి తమ బంధువుల కుమారుడు వివేకే కారణమని తెలిసింది. దీంతో యువతిని తల్లిదండ్రులు నిలదీశారు. అయితే పెళ్లికూతురు మాత్రం తనకు ఏం తెలియదని, వివేక్‌ను ప్రేమించలేదని వాపోయింది. దీంతో ఈ మొత్తం ఘటనపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పెళ్లికూతురి పేరెంట్స్. అయితే ఈసారి వివేక్‌ను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు అవాక్కయ్యారు. నువ్వు ప్రేమిస్తున్నట్లు ఆ అమ్మాయికి చెప్పావా అన్న ప్రశ్నకు.. నో.. నాది వన్‌సైడ్ లవ్ అంటూ షాకిచ్చాడు వివేక్. చెప్పాలి అనుకునే లోపే ఆమెకు పెళ్లి కుదిర్చేశారు అని వాపోయాడు. దీంతో ఏం చేయాలో తెలీక సైబర్ పోలీసులే తలలు పట్టుకోవాల్సి వచ్చింది.

Tags:    

Similar News