మలద్వారం ద్వారా బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

బంగారాన్ని మెడలో వేసుకుంటారు. ఇతను మాత్రం బంగారాన్ని గొట్టాల్లాగా తయారు చేసి మలద్వారంలో దాచి పెట్టి తీసుకొచ్చాడు.

Update: 2019-11-01 11:24 GMT

బంగారాన్ని ఎవరైనా మెడలో వేసుకుంటారు. బ్యాంకులో దాచుకుంటారు. కాని ఇతను మాత్రం ఏకంగా బంగారాన్ని కరింగించి గొట్టాల్లాగా తయారు చేసి తన మలద్వారంలో దాచి పెట్టి తీసుకొచ్చాడు. అంతా చేసినా చివరికి కస్టమ్స్ అధికారులకు దొరికాడు. ఒక ప్రయాణికుడు విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా తరలించడానికి ఈ ప్లాన్ వేసాడు. కాని విషయం తెలసుకున్న ఇంటిలిజెన్స్‌ విభాగం అధికారులు ఆ బంగారాన్ని చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ సంఘటన శంషాబాద్‌ విమానాశ్రయంలో గురువారం చోటు చేసుకుంది.

వివరాల్లోకెళితే హైదరాబాద్ కు చెందిన షేక్‌ ఫయాజ్‌ అహ్మద్‌ 6ఈ-026ఎయిర్‌లైన్స్‌ విమానంలో దుబాయ్‌ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో 667 గ్రాముల బంగారాన్నికరిగించి పేస్టులా మార్చి 6 గొట్టాలలో ఆ పేస్టును నింపాడు. బంగారంతో నింపిన ఆ గొట్టాలని భద్రతా సిబ్బంది కనిపెట్టకుండా తన మలద్వారంలో పెట్టుకున్నాడు. శంషాబాద్‌లో విమానాశ్రమంలో అతను దిగి నడుస్తున్నపుడు అధికారులు అతని నడకను గమనించి అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని విచారించగా తను బంగారాన్ని తరలిస్తున్న విషయాన్ని వెల్లడిచేశారు. దీంతో అధికారులు రూ.25. 68లక్షల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక ఎలాంటి ధ్రువపత్రాలు లేని రూ.1.81లక్షల విలువైన చరవాణులు, బుర్కాలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకున్నామని అధికారులు వెల్లడించారు.



Tags:    

Similar News