Malla Reddy: రేవంత్ రెడ్డి సీఎం కావాలని పగటి కలలు కంటున్నారు
Malla Reddy: మైనంపల్లి హన్మంతరావు ఓ రౌడి...ఆయన గెలిచేది లేదు చేసేది లేదు
Malla Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కావాలని కలలు కంటున్నారని, కానీ ఎవరిని గెలిపించాలో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఎంపీగా గెలిచిన మల్కాజిగిరి నియోజకవర్గానికి టీపీసీసీ అధినేత ఏం చేశారని కనీసం ఒక్కపైసా కూడా ఖర్చు పెట్టలేదన్నారు. నియోజకవర్గానికి ఒక్కపైసా ఖర్చుపెట్టలేని రేవంత్ రెడ్డి..ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రాన్ని ఏం ఉద్దరిస్తాడని మల్లారెడ్డి ప్రశ్నించారు. మైనంపల్లి హన్మంతరావు ఓ రౌడీ అని విమర్శించిన మంత్రి మల్లారెడ్డి...బీఆర్ఎస్ నుంచి గెంటేస్తే ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్లి పోటీ చేస్తున్నాడని అన్నారు. కాంగ్రెస్‌లోకి వెళ్లాక మైనంపల్లి హన్మంతరావు పిచ్చోడు అయ్యాడని మల్లారెడ్డి ఎద్దేవా చేశారు.