ప్రమాదాలతో హడలెత్తిస్తున్న మల్కాపూర్ కూడలి

Update: 2021-01-14 16:31 GMT

Representational Image

ఆ రోడ్డూ పేరుకేమో జాతీయ రహదారి కానీ అది గ్రామీణ రోడ్డు కంటే అధ్వాన్నం అడుగుకో గుంత రోజుకో ప్రమాదం. ఇంతకీ ఎక్కడుంది ఆ డేంజరస్ రోడ్?

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ రహదారి ఇది. 65 వ నెంబరు ముంబై జాతీయ రహదారి పై ఉందీ గ్రామం. నేషనల్ హైవే కావడంతో వాహనాల రాకపోకలతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు వెళ్లాలంటే ఈ రోడ్డు పైనే ప్రయాణం చేయాలి. ఐతే, ఇదే రహ‌దారిపై ఉన్న మల్కాపూర్ చౌరస్తాలో రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. దీంతో చాలా మంది చనిపోయారు. ఎంతో మంది అవిటివారిగా మారారు.

ఎట్టకేలకు మల్కాపూర్ దగ్గర అండర్ పాస్ బ్రిడ్జీ నిర్మాణం కోసం కేంద్రం 26 కోట్ల రూపాయలు మంజూరీ చేసింది. మూడేళ్ల క్రితం మంత్రి హరీష్ రావు నిర్మాణ పనులను ప్రారంభించారు. మొదట్లో నిర్మాణ పనులు వేగంగా జరిగినా ప్రస్తుతం నత్తనడకన నడుస్తున్నాయి. బ్రిడ్జీ నిర్మాణ పనులు స్టార్టయ్యాక సర్వీస్ రోడ్డు పూర్తిగా దెబ్బతింది. మరో వైపు రోడ్డు పై పనులు నడుస్తుండటంతో దుమ్ము, దూలితో వాహనదారులు రోగాల బారిన పడుతున్నారు. వాహనాలు వేగంగా వచ్చి బ్రిడ్జీ కోసం తవ్విన గుంతలో పడి అనేక మంది చనిపోయారు. ఇప్పటి వరకు 15 మంది చనిపోగా మరో 40 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. అండర్ పాస్ బ్రిడ్జీ నిర్మాణం పనులు మూడేళ్లుగా కొనసాగడం పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు గంటల పాటు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మల్కాపూర్ అండర్ పాస్ బ్రిడ్జీ నిర్మాణం పనులను పూర్తి చేసి ప్రమాదాలు నివారించాలని కోరుతున్నారు.

Tags:    

Similar News