Mahindra University launched in Hyderabad : హైదరాబాద్‌లో మహీంద్రా యూనివర్సిటీ ప్రారంభం
Mahindra University launched in Hyderabad : హైదరాబాద్‌లో మహీంద్రా యూనివర్సిటీ ప్రారంభమైంది. తెలంగాణ మంత్రి కేటీఆర్, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా వర్చువల్‌గా యూనివర్సిటీని ప్రారంభించారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం బహదూర్‌పల్లిలో 130 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్యాంపస్‌ను ఏర్పాటు చేశారు. మహీంద్రా యూనివర్సిటీకి ఆనంద్ మహీంద్రా వీసీగా వ్యవహరించనున్నారు. ఈ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ స్థాయిలో మేనేజ్‌మెంట్, మీడియా, లా, ఎడ్యుకేషన్, లిబరల్ ఆర్ట్స్, డిజైన్ కోర్సులను ఆఫర్ చేయనున్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. వర్సిటీ రూపకల్పనలో ఆనంద్ మహీంద్రా క్రియాశీలక పాత్ర వహించారని కొనియాడారు. ఈ యూనివర్సిటీ అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పుతుందన్నారు. మహీంద్రా వర్సిటీ ఇన్నోవేషన్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. వర్సిటీ ప్రారంభం సందర్భంగా మహీంద్రా గ్రూపునకు కేటీఆర్ అభినందనలు తెలిపారు.