కల్నల్ సంతోష్ బాబుకు కేంద్ర ప్రభుత్వం మహావీర్ చక్ర ప్రకటించింది. తెలంగాణ సూర్యాపేటకు చెందిన సంతోష్ బాబు బీహార్ రెజిమెంట్ కమాండింగ్ అధికారిగా ఉన్నారు. గత ఏడాది జూన్ 15న లడక్ గల్వాన్ లోయలో చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి అమరుడయ్యారు. నాటి ఘటనలో కల్నల్ సంతోష్‌బాబుతో పాటు మొత్తం 20 మంది సైనికులు అమరులయ్యారు.
బీహార్ రెజిమెంట్ కమాండింగ్ అధికారిగా సంతోష్‌బాబు వ్యవహరించారు. గతేడాది జూన్ 15న గల్వాన్ లోయ వద్ద చైనా దురాక్రమణకు ప్రయత్నించింది. భారత సేనలు దీనిని తీవ్రంగా ప్రతిఘటించాయి. వారిని ధీటుగా ఎదుర్కొని తిప్పికొట్టాయి. ఈ దాడిలో భారత్‌కు చెందిన 21 మంది జవాన్లు అమరులయ్యారు. వీరిలో కల్నల్ సంతోష్‌బాబు ఒకరు. భారత సైనికుల దాడిలో చైనా వైపు కూడా భారీ ప్రాణనష్టం జరిగింది. సంతోష్‌బాబు దేశానికి అందించిన సేవలకు గౌరవంగా కేంద్ర ప్రభుత్వం మరణానంతరం మహవీరచక్ర పురస్కారాన్ని ప్రకటించింది.