Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం..జులై 5 నుంచి భారీ వర్షాలు

Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న రోజుల్లో తెలంగాణ జిల్లాలో మోస్తరు వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Update: 2024-06-29 02:57 GMT

Weather Update: తెలంగాణపై తుఫాన్ ప్రభావం..నేడు తెలంగాణకు భారీ వర్షసూచన

Rains: వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కేంద్రీక్రుతమైన ఆవర్తన ప్రభావంత ఉత్తర తెలంగాణ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. అల్పపీడన ప్రభావం కోస్తాంధ్ర ఒడిశా, తెలంగాణ, ఉత్తర జిల్లాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. జులై 5 నుంచ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వివరించారు.

గురువారం వరకు వర్షాలు తక్కువగా ఉన్న జిల్లాల్లో కూడా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు చెప్పారు. కుమ్రం భీం జిల్లా వాంకిడిలో శుక్రవారం రాష్ట్రంలోనే అత్యధికంగా 9.05 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. శనివారం కూడా పల జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్జ్ జారీ చేసింది. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలత వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. అందవెల్లి సమీపంలోని పెద్దవాగు దగ్గర బర్రెలు, ఆవులు వాగు దాటుతుండగా వరద ఉద్రతికి కొట్టుకుపోయాయి. 3 కిలోమీటర్ల తర్వాత పశువులను సురక్షితంగా బయటపడ్డాయి. కాగజ్ నగర్ లో అందవెల్లి పెద్దవాగు పై నిర్మించిన అప్రోచ్ రోడ్డుకూడా కొట్టుకుపోయింది. దీంతో 42 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

Tags:    

Similar News