Hanamkonda: హన్మకొండ ప్రసూతి ఆస్పత్రిలో మహిళా సిబ్బంది మందుపార్టీ
Hanamkonda: ఈ వ్యవహారంపై సీరియస్ అయిన జిల్లా వైద్యాధికారులు
Hanamkonda: హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో మహిళా సిబ్బంది మందుపార్టీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆస్పత్రిలోని స్టాఫ్రూమ్లో ఆరోగ్య శ్రీ ఉద్యోగి, ఒక స్టాప్ నర్స్ , మరొక GNM బీర్లు తాగుతూ హల్ చల్ చేశారు. రోగుల పరిస్థితిపై ఎప్పటికప్పుడు అప్రమంత్తంగా ఉండాల్సిన సిబ్బంది ఇలా తమ బాధ్యతను గాలికి వదిలేసి బీరు తాగుతూ ఎంజాయ్ చేస్తుండటంపై ఆస్పత్రి యాజమాన్యం సీరియస్ అయ్యింది. ఈ వ్యవహారంపై ఓ కమిటీ వేసిన ఆస్పత్రి సిబ్బంది ఆ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామంటున్నారు. అయితే ఇలాంటి వ్యవహారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని చెబుతున్నారు.