Telangana: తెలంగాణలో దడ పుట్టిస్తోన్న ఎండలు.. వేడిగాలులకు బలైన చిరుతపులి.. ఎక్కడంటే?
Telangana: తెలంగాణలో దడ పుట్టిస్తోన్న ఎండలు.. వేడిగాలులకు బలైన చిరుతపులి.. ఎక్కడంటే?
Telangana: తెలంగాణ అంతటా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. వేడిగాలులతో జనాలు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు. అయితే, వేడిగాలులతో ప్రజలే కాదు.. వన్యప్రాణులు కూడా తట్టుకోలేకపోతున్నాయి. ఓవైపు రోజురోజుకు పెరుగుతోన్న వేడితో.. ఇంట్లో ఉండాలంటేనే జనాలు భయపడుతున్నారు. ఈ ఎండలకు తట్టుకోలేక ప్రజలు వడదెబ్బలకు గురవుతున్నారు. మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే, పెరుగుతోన్న ఎండలకు జంతువులు కూడా మరణించడం కలకలం రేపుతోంది. తాజాగా నారాయణపేట జిల్లా మద్దూరు మండలం జాదవరావుపల్లిలో చిరుతపులి మృతి చెందిన ఘటన వెలుగుచూసింది.
అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దూరులోని కాలిపోయిన వరి పొలాల్లో చిరుతపులి చనిపోయి కనిపించింది. వృక్షసంపద లేని ప్రాంతం కావడంతో.. వన్యప్రాణులు తలదాచకునేందుకు కనీసం నీడ కూడా లేదంంట. దీంతో జంతువుల మనుగడ పెను సవాలుగా మారిందని నారాయణపేట డీఎఫ్‌వో వీణ్ వాణి ఆవేదన వ్యక్తం చేశారు. మద్దూరు రెవెన్యూ భూమిలో కనీసం నాలుగు చిరుతలు ఉంటాయని, ఇవి నివసించే గుట్టల్లో చెట్లు లేకపోవడంతో వేడిగాలులతో విపరీతంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే వేడి తట్టుకోలేక చిరుతపులి మృతి చెందింది.