హైదరాబాద్ నగరంలో కురుసిన భారీ వర్షానికి మూసీ ఉప్పొంగి ప్రవహిస్తుంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అతలాకుతలం చేస్తుంది. దీంతో ప్రభుత్వం మూసీ నదికి ఇరువైపు రెయిలింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మూసీ రివర్ బోర్డు ఛైర్మెన్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ క్రమంలోనే డ్రోన్ కెమెరాలతో ప్రస్తుతం ఉప్పొంగుతున్న మూసీ నదిని మొత్తం చిత్రీకరిస్తున్నామని తెలిపారు. నదికి ఇరువైపులా రెయిలింగ్ దాని ఆధారంగానే ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకుంటామని సుధీర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఎడతెరపిలేకుండా వర్షం కురవడంతో వరద ప్రవాహం ఎక్కువ ఉందని, దీంతో మూసీ నది ఎక్కువ ప్రవహిస్తుందని వారు తెలిపారు.
మూసీకి ఇంతటి వరద రావడం ఇది రెండోసారి అని భవిష్యత్తులో మూసీ ప్రవాహంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు మూసికి ఇరువైపులా పటిష్టమైన రెయిలింగ్ నిర్మించాలని భావిస్తున్నామని ఆయన తెలిపారు. మూసీ నదిలో వరద పోటెత్తడంతో చాదర్‌ఘాట్, ముసారాంబాగ్ బ్రిడ్జిలు దెబ్బతిని వుంటాయని సుధీర్ రెడ్డి చెబుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం నిపుణల కమిటీ అధ్యాయం చేస్తుందని చెప్పారు. మూసి ప్రవాహం తగ్గిన తర్వాత నదిపై ఉన్న బ్రిడ్జిల కండిషన్ చెక్ చేసి రాకపోకలు పునరిద్దిస్తామని ఆయన చెబుతున్నారు. వరద తగ్గితేగానీ వాటి పరిస్థితి ఏంటన్నది అంఛనా వేయడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. రెయిలింగ్ నిర్మాణం వల్ల నది ఆక్రమణలు తగ్గుతాయని, అదే సమయంలో వరద పోటెత్తినా జనావాసాల్లోకి వరద నీరు రాదని ఆయన వివరించారు.