Sama Ranga Reddy: ఎల్బీనగర్ నియోజకవర్గంలో సమస్యలు లేకుండా చేస్తా
Sama Ranga Reddy: యువతకు చేయూత కల్పిస్తానన్న సామరంగారెడ్డి
Sama Ranga Reddy: ఎల్బీనగర్ నియోజకవర్గం చంపాపేట్ డివిజన్ కర్మన్ ఘాట్ లో బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికి ప్రచారం చేసి పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాల్సిందిగా ఓటర్లను విజ్ఞప్తి చేశారు. తనను గెలిపిస్తే ఎల్బీనగర్ నియోజకవర్గంలో సమస్యలు లేకుండా చేస్తానని యువతకు చేయూత కల్పిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సామరంగారెడ్డి తో పాటు చంపాపేట్ కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి , బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.