Delhi Liquor Case: కవిత సీబీఐ అరెస్ట్‌పై కోర్టుకు లాయర్ మోహిత్‌రావు
Delhi Liquor Case: రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న మోహిత్‌రావు
Delhi Liquor Case: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై కోర్టును ఆశ్రయించనున్నారు న్యాయవాది మోహిత్‌రావు. రౌస్ అవెన్యూ కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేయనున్నారు. అత్యవసరంగా పిటిషన్‌ను విచారించాలని కోర్టును కోరనున్నారు కవిత తరఫు లాయర్. ఎలాంటి నోటీసులు లేకుండా కవితను జైల్లో సీబీఐ ఎలా అరెస్ట్ చేస్తుందని కవిత లాయర్ మోహిత్‌రావు పిటిషన్‌లో ప్రశ్నించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. కవితను అరెస్ట్ చేసినట్లు కోర్టుకు తెలిపిన సీబీఐ అధికారులు.. రేపు ఆమెను కోర్టులో హాజరుపర్చనున్నారు. CBI కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. కవితను 10 రోజుల కస్టడీకి కోరే యోచనలో సీబీఐ ఉన్నట్టు సమాచారం. కవితను ఈ నెల 6న జైలులో విచారించిన CBI అధికారులు.. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పాత్రపై ప్రశ్నించారు. ఇప్పటికే ఈడీ కేసులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న కవిత.. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.