తెలంగాణలో నెరవేరబోతున్న సీనియర్ జర్నలిస్టుల దశాబ్దాల కల

తెలంగాణలో సీనియర్ జర్నలిస్టుల కోసం జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్ట్స్‌ మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కో ఆపరేటివ్ హౌజింగ్‌ సొసైటీకి భూమిని అప్పగించనున్నారు.

Update: 2024-09-07 12:26 GMT

Revanth Reddy

 తెలంగాణలో సీనియర్ జర్నలిస్టుల దశాబ్దాల కల నెరవేరబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం..జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్ట్స్‌ మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కో ఆపరేటివ్ హౌజింగ్‌ సొసైటీకి భూమి అప్పగించే ముహూర్తం ఖరారు అయింది. రేపు ఉదయం 10గంటలకు రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని.. పేట్‌ బషీరాబాద్‌లోని 38 ఎకరాల స్థలాన్ని జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి అందజేయనున్నారు.

ప్రజా ప్రభుత్వంలో జర్నలిస్టుల సంక్షేమం అనే పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్, మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస రెడ్డితో పాటు మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. మరోవైపు విధి నిర్వహణలో వివిధ కారణాల వల్ల మరణించిన 36 మంది జర్నలిస్టుల కుటుంబాలకు మీడియా అకాడమీ ద్వారా ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు.

Tags:    

Similar News