Lagcherla Attack: పట్నం నరేందర్ రెడ్డికి రెండు రోజుల పోలీస్ కస్టడీ
Lagcherla Attack: పట్నం నరేందర్ రెడ్డిని రెండు రోజుల పోలీస్ కస్టడీకి శుక్రవారం కొడంగల్ కోర్టు అనుమతి ఇచ్చింది.
Lagcherla Attack: పట్నం నరేందర్ రెడ్డిని రెండు రోజుల పోలీస్ కస్టడీకి శుక్రవారం కొడంగల్ కోర్టు అనుమతి ఇచ్చింది.న్యాయవాది సమక్షంలోనే విచారించాలని కోర్టు ఆదేశించింది.లగచర్ల దాడి కేసులో అరెస్టైన పట్నం నరేందర్ రెడ్డి ప్రస్తుతం జైలులో ఉన్నారు. డిసెంబర్7, 8 తేదీల్లో నరేందర్ రెడ్డిని పోలీసులు విచారించనున్నారు.
దుద్యాల మండలంలో ఫార్మా క్లస్టర్ ఏర్పాటుపై లగచర్ల-దుద్యాల గ్రామాల మధ్య ఈ ఏడాది నవంబర్ 11న ప్రజాభిప్రాయసేకరణ ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రజాభిప్రాయసేకరణకు ప్రజలు హాజరుకాలేదు. బీఆర్ఎస్ నాయకులు బి.సురేష్ వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ వద్దకు వెళ్లి లగచర్ల గ్రామానికి వచ్చి స్థానిక ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలని కోరారు. సురేశ్ మాటలతో లగచర్లకు వెళ్లిన కలెక్టర్ సహా జిల్లా ఉన్నతాధికారులపై గ్రామస్తులు దాడికి యత్నించారు. అయితే పోలీసులు వారిని రక్షించారు. అయితే కడా అధికారి వెంకట్ రెడ్డిని స్థానికులు కొట్టారు. ఈ ఘటనలో సురేశ్ , పట్నం నరేందర్ రెడ్డి సహా సుమారు 20 మందిని అరెస్ట్ చేశారు.