Karimnagar: మానేరు రివర్ ఫ్రంట్ పనులు ప్రారంభించనున్న కేటీఆర్

Karimnagar: రూ. 490 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ పనులు

Update: 2022-03-16 05:51 GMT

మానేరు రివర్ ఫ్రంట్ పనులు ప్రారంభించనున్న కేటీఆర్

Karimnagar: ఉత్తర తెలంగాణకు పర్యాటక శోభనివ్వనున్న మానేరు రివర్ ఫ్రంట్ పనులకు రేపు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు తీరంలో రివర్ ఫ్రంట్ పనులు ప్రారంభించనున్నారు. సబర్మతి రివర్ ఫ్రంట్ మాదిరిగా నిర్మాణం చేపట్టనున్నారు. సబర్మతి రివర్ ఫ్రంట్ నిర్మాణానాన్ని పరిశీలించిన అధికారులు.. కొత్త టెక్నాలజీతో పాటు పర్యాటకంగా ఉపయోగపడే విధంగా 490 కోట్లతో నిర్మాణం చేపట్టేందుకు చర్యలు చేపట్టారు. మానేరు వంతెనపై మంత్రి కేటీఆర్ వాటర్ పైలాన్ ను అవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా నగరం అంతటా స్వాగత తోరణాలతో గులాబీ మయం చేశారు టీఆర్ఎస్ శ్రేణులు.

కరీంనగర్-వరంగల్ పాత రోడ్డులో తీగల వంతెనను సైతం నిర్మించిన అధికారులు కేబుల్ బ్రిడ్జిపై డైనమిక్ లైట్లు ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే ఈ వంతెననను అందుబాటులోకి తీసుకోరానున్నారు. మానేరు రివర్ ఫ్రంట్ ముఖద్వారాంగా ఈ కేబుల్ బ్రిడ్జి ఉండనున్నది. 410 కోట్లతో .375 కిలో మీటర్లు.. మొదటి దశ 6.25 కిలో మీటర్లు రెండో దశలో మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణం చేపట్టనున్నారు. ఢిల్లీకి చెందిన ఐఎన్ఎస్ కన్సల్టెన్సీ మానేరు రివర్ ఫ్రంట్ పనులు చేపట్టనున్నది.

మానేరు రివర్ ఫ్రంట్ కు ఇరువైపులా పార్కులు. వాటర్ ఫౌంటేన్స్, థీమ్ పార్కులు, వాటర్ స్టోర్స్, మ్యూజికల్ ఫౌంటేన్స్ ఆట స్థలాలు, గార్డెన్స్ ఏర్పాటు చేయనున్నారు. రిటైనింగ్ వాల్స్, పార్కులు, నడక దారులతో పాటు పర్యాటకంగా అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం స్థల సేకరణ చేస్తుంది.

Tags:    

Similar News