KTR: రాజీవ్‌ గాంధీ విగ్రహ ఏర్పాటు అందుకే

కంప్యూటర్‌ను కనిపెట్టింది ఎవరో కూడా తెలియని పరిస్థితిలో రేవంత్‌ ఉన్నారని సెటైర్ వేశారు.

Update: 2024-09-17 08:02 GMT

KTR: రాజీవ్‌ గాంధీ విగ్రహ ఏర్పాటు అందుకే

KTR: ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయం ఎదుట రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని పెట్టారని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సెప్టెంబర్‌ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహిస్తోన్న బీఆర్ఎస్, తెలంగాణ భవన్‌లో వేడుకలను నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జాతీయ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. గతంలో సోనియాగాంధీని బలిదేవత అని తిట్టిన రేవంత్‌రెడ్డి, వాటిని కవర్ చేసుకోవడానికే రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టారని ఎద్దేవా చేశారు.

కంప్యూటర్‌ను కనిపెట్టింది ఎవరో కూడా తెలియని పరిస్థితిలో రేవంత్‌ ఉన్నారని సెటైర్ వేశారు. రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టాడని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు.. కంప్యూటర్ కనిపెట్టిన ఛార్లెస్ బాబేజ్ ఆత్మ ఎక్కడున్నా బాధపడుతుంది. మీకు తెలియదు, ఎవరైనా చెప్తే వినవంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పాలనే లేదు.. సెప్టెంబర్‌ 17ను ప్రజాపాలన అంటున్నాడని విమర్శించారు. ఇకనైనా పరిపాలనపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. ఇచ్చిన 420 హామీలను నెరవేర్చే వరకు మిమ్మల్ని వదిలే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సకల మర్యాదలతో రాజీవ్‌ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్‌కు పంపిస్తామన్నారు.

Tags:    

Similar News