KTR: సుఖేష్ ఎవరో తెలియదు.. న్యాయపరంగా చర్యలు తీసుకుంటా
KTR: గవర్నర్ తమిళిసైకి సుఖేష్ చంద్రశేఖర్ రాసిన లేఖపై స్పందించిన కేటీఆర్
KTR: గవర్నర్ తమిళిసైకి సుఖేష్ చంద్రశేఖర్ రాసిన లేఖపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈడీకి ఇచ్చిన స్టేట్‌మెంట్లను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని... సాక్షాలను ఇవ్వాలని బెదిరిస్తున్నట్లు గవర్నర్ తమిళి సైకి సుఖేష్ లేఖ రాశాడు. సుఖేష్ రాసిన ఈ లేఖపై కేటీఆర్ ట్వీట్ చేశారు. సుఖేష్ ఎవరో తనకు తెలియదన్నారు మంత్రి కేటీఆర్. సుఖేష్ చంద్రశేఖర్ ఆరోపణలు తన దృష్టికి వచ్చాయని తెలిపారు. సుఖేష్ అనే వ్యక్తి గురించి తానెప్పుడూ వినలేదన్నారు. సుఖేష్ వ్యాఖ్యలపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని కేటీఆర్ పేర్కొన్నారు.